यद् एतत् प्रकाशरूपं शिवतत्त्वम् उक्तम् तत्र अखण्डमण्डले यदा प्रवेष्टुं न शक्नोति तदा स्वातन्त्र्यशक्तिम् एव अधिकां पश्यन् निर्विकल्पम् एव भैरवसमावेशम् अनुभवति अयं च अस्य उपदेशः सर्वम् इदं भावजातं बोधगगने प्रतिबिम्बमात्रं प्रतिबिम्बलक्षणोपेतत्वात् इदं हि प्रतिबिम्बस्य लक्षणं यत् भेदेन भासितम् अशक्तम् अन्यव्यामिश्रत्वेनैव भाति तत् प्रतिबिम्बम् मुखरूपम् इव दर्पणे रस इव दन्तोदके गन्ध इव घ्राण मिथुनस्पर्श इव आनन्देन्द्रिये शूलकुन्तादिस्पर्शो वा अन्तःस्पर्शनेन्द्रिये प्रतिश्रुत्केव व्योम्नि
Transliteration (IAST)
yad etat prakāśarūpaṃ śivatattvam uktam tatra akhaṇḍamaṇḍale yadā praveṣṭuṃ na śaknoti tadā svātantryaśaktim eva adhikāṃ paśyan nirvikalpam eva bhairavasamāveśam anubhavati ayaṃ ca asya upadeśaḥ sarvam idaṃ bhāvajātaṃ bodhagagane pratibimbamātraṃ pratibimbalakṣaṇopetatvāt idaṃ hi pratibimbasya lakṣaṇaṃ yat bhedena bhāsitam aśaktam anyavyāmiśratvenaiva bhāti tat pratibimbam mukharūpam iva darpaṇe rasa iva dantodake gandha iva ghrāṇa mithunasparśa iva ānandendriye śūlakuntādisparśo vā antaḥsparśanendriye pratiśrutkeva vyomni
ప్రకాశరూపమైన శివతత్త్వము చెప్పబడినది; ఆ అఖండమండలమునందు ప్రవేశించుటకు సాధకుడు సమర్థుడు కానప్పుడు, స్వాతంత్ర్యశక్తినే అధికముగా చూచుచు నిర్వికల్పమైన భైరవసమావేశమును అనుభవించును. అతనికి ఈ ఉపదేశము: ఈ సమస్త భావజాతము (వస్తు సముదాయము) బోధగగనమునందు (చైతన్యాకాశమునందు) ప్రతిబింబమాత్రమే, ఏలయన అది ప్రతిబింబ లక్షణముతో కూడినది. ప్రతిబింబము యొక్క లక్షణమిది: ఏది భేదముతో భాసించుచు, స్వయముగా అశక్తమై, అన్యముతో వ్యామిశ్రముగానే (కలిసిపోయి) భాసించునో అది ప్రతిబింబము - అద్దమునందలి ముఖరూపమువలె, దంతోదకమునందలి (పంటిమీది నీటిలోని) రసమువలె, ఘ్రాణేంద్రియమునందలి గంధమువలె, ఆనందేంద్రియమునందలి మిథున స్పర్శవలె, లేక అంతఃస్పర్శనేంద్రియమునందలి శూల-కుంతాది స్పర్శవలె, ఆకాశమునందలి ప్రతిధ్వనివలె.