हृदयकमलमध्ये निर्विशेषं निरीहम् हरिहरविधिवेद्यं योगिभिर्ध्यानगम्यम् ।
जननमरणभीतिभ्रंसि सच्चित्स्वरूपम् सकलभुवनबीजं ब्रह्म चैतन्यमीडे ॥५०॥
hṛdayakamalamadhye nirviśeṣaṃ nirīham hariharavidhivedyaṃ yogibhirdhyānagamyam |
jananamaraṇabhītibhraṃsi saccitsvarūpam sakalabhuvanabījaṃ brahma caitanyamīḍe ||50||
హృదయకమల మధ్యమునందు—నిర్విశేషమైన, నిరీహమైన, హరిహరవిధులచే వేద్యమైన, యోగులకు ధ్యానగమ్యమైన, జననమరణ భయమును పోగొట్టు, సచ్చిత్‌స్వరూపమైన, సకల భువనములకు బీజమైన బ్రహ్మ చైతన్యమును స్తుతించుచున్నాను.